అక్షరం పంజరంలో ఉంది
అక్షరం పక్షీలా ఎగరాలనుకుంది!!
పట్నం ఓ రంగులరాట్నం
పల్లె ఓ మల్లెపువ్వు!!
తలెత్తుకున్న పక్షి
అక్షరాలను తిందీ!!
రెక్కలు విరిగిన అక్షరం
పక్షిని ఆశ్రయించింది!!
చెట్టును చేరుకునేందుకు పక్షి అక్షరమై
కాగితంపై వాలింది.
వేటగాని వలలో అక్షరాలు చిక్కుకున్నవీ
రెక్కలొచ్చిన అక్షరాలు పక్షిలామారి
వేటగాన్ని కాటు వేసినవీ
ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచిన పక్షి పిల్లలు
అక్షరాలుగా మారి -
రెక్కలను మర్చిపోయినవీ!!
వాలేందుకు ఆకాశంలో ఆధారం ఏముంది
ఎగిరేందుకు ఆకాశంలో అడ్డేముంది!!!?
పక్షి ఓ ప్రయాణం-అక్షరం ఓ ఒంటరి పరిణామం.!
సీతాకోచిలుక జీవిత చరిత్రలా
అక్షరం ఓ పట్టు వస్త్రం!!
వేషం భాష మారిన పక్షి ప్రాణంగా మారిన అక్షరం.
మెల్లిగా మొలకెత్తిన విత్తనంలా
పచ్చదనాన్ని పంచుతున్నవీ
నీడలు లేని అక్షరాలు పల్లెల్లో పొద్దుపొద్దున్నే వాలిపోతున్నవీ!!
పట్నం ఓ రంగులరాట్నం
పల్లె ఓ మల్లెపువ్వు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి