"సతీశ్ చూడరా! ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తాడు." అన్నాడు రాజేశ్. "వాడి మొహం! అందరు టీచర్లను ఐస్ చేస్తాడు. తీయని మాటల తోటే ఆకట్టుకుంటాడు. దాంతో టీచర్లు వాడికి మార్కులు బాగా వేస్తారు." అన్నాడు జగదీశ్. "మహేశ్ చాలా గ్రేట్. అన్ని ఆటల్లోనూ ఫస్ట్ వస్తాడు." అన్నాడు సురేశ్. "వాడా! చదువులో వేస్ట్." అన్నాడు జగదీశ్. "ఆ ధనంజయ చూడరా! చాలా క్రమశిక్షణ విద్యార్థి. ఎవరి జోలికీ పోడు. అందరినీ కలుపుకుంటూ పోయి, అందరితో స్నేహంగా ఉంటాడు. గర్వం అసలే ఉండదు." అన్నాడు వాసు. "వాడో పెద్ద అపరిచితుడు. మనతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ మన గురించి అవతలి వాళ్ళకు చెడుగా చెబుతాడు." అన్నాడు జగదీశ్.
ఇలా జగదీశ్ ప్రతి ఒక్కరి గురించీ చెడుగా చెబుతాడు. ఎవ్వరినీ మెచ్చుకోడు. తన గురించి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తాడు. ఒకరోజు రాముతో జగదీశ్ పని గట్టుకోని అవతలి వాళ్ళ గురించి చెడుగా చెబుతూ ఉంటాడు. అక్కడే ఉన్న శ్రుతి ఇలా అన్నది. "అందరిలో లోపాలు వెతుకుతూ నువ్వు గొప్ప అనుకుంటున్నావు. నీది కోడిగుడ్డుకు ఈకలు పీకే గుణం. ఎదుటి వారిలో లోపాలు లేకున్నా వెతికి మరీ అందరికీ చెడుగా చెప్పే గుణం నీది. లోపాలు వెదకడం కాదు. ముందు నీ లోపాలు సరి చేసుకో." అని. ఘొల్లుమని నవ్వారు అక్కడ ఉన్న వారంతా. జగదీశ్ సిగ్గుతో తల దించుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి