జ్ఞానం- సంపద -అర్హతలు !!?వెనకబడిన తరగతులకు అవసరం :-డా ప్రతాప్ కౌటిళ్యా
 సంపదను సృష్టించే అన్ని అవకాశాల్లో అర్హతల్లో మరియు చట్టసభల్లో రాజ్యాధికారంలో కూడా శతాబ్దాలుగా అగ్రవర్ణాలే ముందున్నారు. ఇప్పుడిప్పుడే బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులై దేశ సంపదలో అధికారంలో చట్టసభల్లో తమ వాటాను అడుగుతున్నారు. ఇది ఒక రకంగా గొప్ప రాజకీయ పరిణామం. ఒక గొప్ప సందర్భం సందీకాలంగా భావించవచ్చు. 

ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా తమ హక్కులను దేశ సంపదలో ఉద్యోగాల్లో చట్టసభల్లో తమ వాటాను పొందే అవకాశాన్ని అంబేద్కర్ కల్పించాడు కానీ బడుగు బలహీన వర్గాలు మాత్రం ఒకరకంగా నష్టపోయారు. వాళ్లకు సంపదను సృష్టించే అవకాశాలు అర్హతలు లేకపోవడం మరియు చట్టసభల్లో అధికారంలో లేకపోవడం వల్ల చాలా వెనుకబడ్డారు. 

బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తమ వాటాను చట్టసభల్లో అధికారం కోసం అడుగుతున్నారు. కానీ బలహీనవర్గాల పరిస్థితి ఏమిటంటే వాళ్లకు ఉన్నత వర్గాల నుంచి కానీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కానీ ఎలాంటి సానుభూతి లేకపోవడం. సానుభూతి లేకుండా రాజకీయాల్లో రాణించలేం. కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సానుభూతి ఉంది కాబట్టి వాళ్లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. 

ఇంతకాలంగా ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలు రాజకీయాల్లో చట్టసభల్లో అధికారంలో ఎందుకు నిలదొప్పుకొని కొనసాగుతున్నారంటే వాళ్లకు సంపద ఉంది జ్ఞానముంది అర్హతలు ఉన్నాయి. మరి బడుగు బలహీనవర్గాల దగ్గర సంపద లేదు జ్ఞానం లేదు అర్హతలు లేవు. అందుకే బడుగు బలహీన వర్గాలు జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాల్లో దేశ సంపదలో రిజర్వేషన్లు పొంది, సంపదను జ్ఞానాన్ని అర్హతలను పొందాలి. ఆ తర్వాత చట్టసభల్లో రాజ్యాధికారంలో వాటా కోసం పోరాడాలి పోటీ పడాలి. అంటే జ్ఞానం సంపద అర్హతలు ఉంటేనే చట్టసభల్లో రాజ్యాధికారంలో నిలదొక్కుకుంటాం తప్ప మరో మార్గం లేదు.+++++++++++++!?
++++++±+++++++++++++++
డా ప్రతాప్ కౌటిళ్యా.
------------_--------------

కామెంట్‌లు