నానీలు:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
జీవితం
క్షణభంగురమని
తెలిసింది
నీటి బుడగ సాక్ష్యం!
  
వృధ్యాప్యం
వచ్చాకే తెలిసింది
యవ్వన ప్రాయం
కరిగిరిపోయిందని!

పండుటాకు
రాలింది!
జీవిత ముగింపు కథ
అవగాహన అయింది

జీవితాన్ని
గెలవాలనే తపన!
కడలి కెరటాలే!
నా స్పూర్తి...

సృష్టిలో శ్రేష్టమైన
తల్లిపాలకు
మరో రూపము
నిజంగా బాల్యమే!

పుడమి పడుచు
ఆకుపచ్చ చీరకట్టింది
కన్నుల పండుగ
పచ్చదనం!
     
అమ్మ 
అంబుధిలో
ఎంత సర్ఫ్ కల్పిందో!
ఎడతెగని నురగలు!!
    
నేడు
చరవాణి చేతిలో
బంధీలు
యువత హృదయాలు
 
టెక్నాలజీ
పెరిగిందా?
నిజమే! నిదర్శనం!
సైబర్ నే(ఘో)రాలు!


కామెంట్‌లు