అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జరుపుకుంటారు. జాతీయ, జాతి, భాషా, సాంస్కృతిక, ఆర్థిక లేదా రాజకీయ విభజనలతో సంబంధం లేకుండా మహిళలు సాధించిన విజయాలకు గుర్తింపు పొందే రోజు ఇది.1977లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు యూరప్ అంతటా కార్మిక ఉద్యమాల కార్యకలాపాల నుండి మొదట ఉద్భవించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళా హక్కుల ఉద్యమంలో కేంద్ర బిందువుగా ఏటా జరుపుకునే సెలవుదినం . అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగ సమానత్వం , పునరుత్పత్తి హక్కు.లు మరియు మహిళలపై హింస మరియు దుర్వినియోగం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది.జూలియన్ క్యాలెండర్ ప్రకారం, రష్యన్ మహిళలు ఫిబ్రవరి 23, 1913న (గ్రెగోరియన్ క్యాలెండర్‌లో మార్చి 8) మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ ర్యాలీలకు ఒక ప్రమాణంగా మారింది.మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్‌లో ఫిబ్రవరి 28వ తేదీ, 1909 జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్‌లో జరిగిన వస్త్ర కార్మికుల సమ్మె జ్ఞాపకార్థం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది 1910లో కోపెన్‌హాగన్ రెండవ అంతర్జాతీయ శ్రామిక మహిళల సమావేశాన్ని నిర్వహించింది. సమాన హక్కుల కోసం మహిళల డిమాండ్లను ప్రపంచవ్యాప్త వేడుకగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ మహిళా కార్యాలయ అధిపతి, జర్మన్ సోషలిస్ట్ క్లారా జెట్కిన్ సూచించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, బరాక్ ఒబామా ప్రభుత్వం 2011లో మార్చి నెలను మహిళా చరిత్ర మాసంగా ప్రకటించింది.ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇతి వృత్తం క్రియాశీలత. ఈ సంవత్సరం థీమ్ మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ఇది మహిళల జీవితాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన పురోగతికి పిలుపునిస్తుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి, సమాన అవకాశాలను అందించడానికి.. వివక్షను ఇక ఈ రోజున ప్రత్యేకమైన కొన్ని రంగుల దుస్తులు కూడా ధరిస్తారు. ఎక్కువగా ఊదారంగు(పర్పుల్), ఆకుపచ్చ, తెలుపు రంగుల వస్త్రాలని ధరిస్తారు. ఇక్కడ పర్పుల్ అంటే ఊదా రంగా న్యాయ, గౌరవానికి సూచనగా, ఆకుపచ్చ రంగు హామిని ఇస్తుంది. ఇక తెలుపు స్వచ్ఛతకి సూచనగా ధరిస్తారు.
అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ దేశానికి, సంస్థ, సంఘానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి లింగ బేధం కూడా ఉండదు.లింగ బేధాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాలను, సంస్థలను ప్రేరేపిస్తుంది.
అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ దేశానికి, సంస్థ, సంఘానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని జరుపుకుంటారు. ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి లింగ బేధం కూడా ఉండదు.లింగ బేధాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాలను, సంస్థలను ప్రేరేపిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి