వాగు పాడిన పాట
మూగ నేల విన్నది
అడివి అంతా ఆడింది.!!
ఆకాశానికి పూసిన
పువ్వును
మేఘమాల చూసింది
మూగ నేల నవ్వింది!!
చీకటి చెట్టుకు రాలిన
నక్షత్రాలను
పగలు పలకరించింది
మూగ నేల ఏరింది!!!
వెన్నెల చిలికిన మీగడలను
కన్నెల పొగడ్తలను
చెరువులన్నీ విన్నవి
మూగ నేల కన్నది!!!
భానుడు విసిరిన బాణాలు
ఏరు నిలిపిన
పచ్చని ప్రాణాలు
మూగ నేల కడుపులో పండినవి!!
కడలి చిత్రాలు అలలు
తీరం చేరినవి
కడలి నీడల అక్షరాలు
మూగ నేల ఒడిలో చేరినవి!!!
నేడు వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి