సుప్రభాత కవిత : -బృంద
వెతల గతం మర్చిపోయి 
కలతల కలలు కరిగిపోయి 
మమతలేవో వెదుకుతూ
భవితలోకి అడుగు పెడుతూ.....

కన్నీటి జ్ఞాపకాలు కథలుగా 
కసిపుట్టు అవమానాలు ఆజ్యాలుగా 
కలగన్న తీరానికి చేరువగా 
మొదలైన పయనపు దారిలో....

ఒడిదుడుకులను ఓర్పుగా 
వెలుగు నీడల్లో నేర్పుగా 
కష్ట సుఖాలు ఒకే తీరుగా 
కల నిజం చేసుకునే క్రమంలో...

అడుగుకు అడుగే తోడై 
గొడుగుగ ఆకసం నీడై 
చెదరని నమ్మకం బలమై 
బెదరని దేహం బలగమై....

పిలిచే తూరుపు వెలుగులో 
తలచే గమ్యపు తలపుతో 
నడిచే  గమనమే ధ్యేయమై 
జరిగే పయనమే జీవితం.

రేపన్నది నిజం 
రానున్నది విజయం అంటూ 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు