అడయార్ మర్రి. ఇది మద్రాస్ నందలి ఆడయారులో ఉన్నది. దీని యొక్క విస్తీర్ణం దాదాపుగా ఒక ఎకరం ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది. పూజనీయమైనది. ఇక్కడికి వచ్చే యాత్రికులు మరియు ఇక్కడి ప్రజలు గాఢంగా నమ్ముతారు. ఇప్పుడు ఇది శిధిలమై పోయింది.
ఇండియాలో మర్రి చెట్లు 120 వరకు ఊడలు దింపి 2000 అడుగుల వరకు వ్యాపించగలవు. అలెగ్జాండరు తన దండయాత్రలో అటువంటి ఒక మర్రిని తన ఏడు వేలు సైన్యానికి శిబిరంగా ఒకనాడు వినియోగించుకున్నాడు.
మర్రి చెట్లను పాలమర్రి ఒక రకం. దీని మాను తెల్లగా వెండి పూత వలె ఉండి నిగనిగలాడుతూ ఉంటుంది. పసిడిమర్రి మాను మామూలుగా ఉండి పండ్లు మాత్రం పసుపు రంగులో ఉండి తీయగా ఉంటాయి. అలాగే నల్ల మర్రి యొక్క మాను ఆకులు, ఈనెలు, నల్లగానే ఉంటాయి. హైదరాబాదు నుండి చేవెళ్ల వెళ్లే దారిలో ఈ నల్ల మర్రి చెట్లు ఉంటాయి. ఇక గున్న మర్రి చెట్లు ఎంత కాలమైనా, ఎంత వయసు ఉన్నా గాని ఎత్తు ఎదగవు. ఇవి హైదరాబాదు నుండి కల్వకుర్తికి వెళ్లే రోడ్డున ఉన్నాయి. ఇంకా మర్రి లో అనేక రకాలు ఉన్నాయి. అవి పగిడి మర్రి, ఎర్ర మర్రి, సన్న మర్రి, చాగలమర్రి వంటివి కొన్ని రకాలు.
మనం ఈ మర్రి చెట్లను గురించి తెలుసుకుందామా మరి.
మర్రిలో రకాలు. మహావృక్షాలుల :-తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి