వెలుగురేఖల జిలుగు కాంతులు
తగిలి తరించిన గడ్డి పువ్వులు
విరిసి మురిసెను తనివి తీరా...
కమలబాంధవుని రాక చూచి!
నింగి దాచిన అందాలన్నీ
రంగుతేలిన తీరును
నీట చూచి ముచ్చటపడి ఏటికి
నొసట ముద్దిడె బాలభానుడు!
తెల్లవారి వెలుగులోన
తరచి చూడ ధరణిలోన
వెల్లివిరియు సొగసులన్నీ
మెల్ల మెల్లగా మనసు దోచు!
పెనుచీకటి కావల వెలిగే
దివ్య కాంతి అనుభూతి
అనుదినము అనుభవించగ
అనుగ్రహించు అంతర్యామి.
మనసులోని కలతలన్నీ
ఒకటొకటిగా తొలగించు
వరమేదో కురిపించి ప్రేమగా
కాచి రక్షించు ఆదిదైవమునకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి