పాపం మగమహారాజులు :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు 
ఆడవాళ్ళ సొంతమట 
వారే 
అలంకరించుకోవటానికి అర్హులట 

పూలు 
పొంకాలు చూపుతాయట 
అతివలు 
అందాలు చిందుతారట

పూలు 
సుకుమారంగా ఉంటాయట 
పడతులు  
సుతిమెత్తంగా ఉంటారట 

పూలు 
పలువర్ణాలలో ఉంటాయట 
మగువలు  
పలురకాలబట్టలు ధరిస్తారట 

పూలు 
పరిమళాలు చల్లుతాయట 
స్త్రీలు 
సౌరభాలు వెదజల్లుతారట 

పూలు 
మత్తును ఎక్కిస్తాయట 
మహిళలు 
మైకము కలిగిస్తారట 

పూలు 
ప్రేమకు ప్రతీకలట 
అంగనలు 
ప్రేమకు ఆలవాలమట 

పూలమీద 
ఇంతులదే గుత్తాధిపత్యమట 
పురుషులకు 
ఇవ్వటానికే  అధికారమట 

కావాలంటే 
మగవారు చెవుల్లోపెట్టుకోవచ్చట 
లేకపోతే 
చేతులకు మాలలుచుట్టుకోవచ్చట 

మొగవారు 
మంచాలమీద చల్లుకోవచ్చట
మైమరచి 
నిద్రలోకి జారుకోవచ్చట 


కామెంట్‌లు