తెల్లవారే.. నేలకు
వెలుగుల వెల్ల వేస్తూ
మెల్లగా పరచుకుంటూ
చల్లగా వచ్చిన వేకువ..
పచ్చని తొడుగు ధరించి
తచ్చాడే నీరెండ తాక
వెచ్చగా చేయి కలిపి
చెలిమి చేయ వేచె ధరిత్రి.
వసంతపు రాక సూచించు
లేత చిగురులు నిండిన
తరువులన్నీ కొత్తగా వెలిగిపోతూ
తలలూపుతూ పలికె స్వాగతము.
నవ్య కుసుమాలెన్నో విరిసి
భవ్య పరిమళము తోడ
దివ్య హారతి గా ఊగే తీగ సాగి!
అణువణువూ అందాలతో
అలరారు అవనిలోన
అపురూపముగా తోచు
ఆదిత్యుని ఆగమన వేళ...
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి