న్యాయాలు -795
తృణ భక్షణ న్యాయము
*****
తృణము అంటే గడ్డి. భక్షణము అంటే తినడము , భుజించడం అని అర్థం.తృణ భక్షణము అంటే గడ్డి తినడం.
గడ్డిని పశువులు కదా తినేది. మరి తృణ భక్షణ న్యాయము అంటే ఏమిటో చూద్దాం.
దీనికి సంబంధించిన ఓ శ్లోకం చూద్దాం.
"వైరిణో పిహి ముచ్యన్తే ప్రాణాన్తే తృణ భక్షణాత్,/ తృణాహారాః సదైవైతే హన్యన్తే పశవః కథమ్?"
అంటే యుద్ధంలో శత్రురాజుల చేతిలో చిక్కినప్పుడు, ఓటమి పాలైన రాజు తనను చంపకుండా వదిలేయమని ప్రాధేయపడుతూ వెను వెంటనే గడ్డి పరక నోటిలో పెట్టు కొంటాడు.అది చూచిన వెంటనే శత్రు రాజు చంపకుండా వదిలేస్తాడు.ఇది యుద్ధ ధర్మం.దీనినే "గడ్డి కరవడం" అన్న మాట. అలా వేడుకున్న రాజును ఆ శత్రు రాజు అతడిని నిరపాయకరమైన వ్యక్తిగా, పశు సమానుడిగా భావించి చంపకుండా వదిలేయడాన్ని తృణ భక్షణ న్యాయము అంటారు.
అంటే ఓడిన రాజు ప్రాణ భిక్ష పెట్టమని అర్థించడమూ, అతని వల్ల తనకెలాంటి ప్రమాదం లేదనుకున్నప్పుడు, గెలిచిన రాజు అతడిని తన పశు సంపదలో ఓ భాగంగా గ్రహించి రక్షించడమని కూడా చెప్పుకోవచ్చు.
ఎవరికైనా ప్రాణంపై ప్రీతి ఉంటుంది.ఇలాంటి సందర్భంలో ప్రాణ భీతి కూడా ఉంటుంది. కాబట్టి చంపాల్సినంత దుర్మార్గుడైన శత్రువు చేతిలో చిక్కినా అతడిని చంపకుండా, ఎటువంటి అపకారము తలపెట్టకుండా వదిలేయడం మంచిది. అలా చేయడంలోనే మనిషి యొక్క మంచితనం మానవీయ లక్షణం కనబడుతుంది అంటారు వేమన కవి.
"చంపదగిన యట్టి శత్రువు తనచేత/జిక్కెనేని కీడు సేయరాదు/పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు/ విశ్వధాభిరామ వినురవేమ!"
మహా భారత యుద్ధంలో ద్రౌపది ఐదుగురు కుమారులైన ఉప పాండవులను అశ్వత్థామ కౄరంగా చంపుతాడు. ఆ తర్వాత అతడు పాండవుల చేతికి చిక్కుతాడు.పాండవులు అతడిని చంపుతామని అన్నప్పుడు తన కుమారులు మరణించిన అంత దుఃఖంలోనూ అతడిని చంపకుండా వదిలేయమని చెబుతుంది. తనలాగా అతడి తల్లి పుత్ర వినియోగంతో తల్లడిల్లి పోవద్దని అనుకుంటుంది.అది ఆమె లోని మహోన్నత వ్యక్తిత్వం, మాతృ హృదయానికి నిదర్శనం.
కానీ నేడు "గడ్డి కరవడం/ తృణ భక్షణం"అనే పదాన్ని మరో రకంగా ఉపయోగించడం చూస్తున్నాం.
అవినీతికి పాల్పడిన వ్యక్తులకు వర్తింప చేస్తూ ఫలానా వ్యక్తి ఫలానా విషయంలో కక్కుర్తి పడ్డాడనీ, నానా గడ్డి కరిచి అనుకున్నది సాధించాడని తెలపడానికి ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పడం గమనార్హం.
ఇలా ఈ న్యాయాన్ని మంచికి,చెడుకు మధ్య రకరకాలుగా ఉదహరిస్తున్నా మనం మంచినే పరిగణనలోకి తీసుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి