జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా విద్యాశాఖ నిర్దేశాల మేరకు విజ్ఞాన శాస్త్ర అంశాలపై మండల స్థాయి పోటీలను నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి నిమ్మల శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో గులివిందలపేట, ద్వితీయ స్థానాల్లో పారాపురం, గూనభద్రకోలనీ ప్రాథమిక పాఠశాలలు నిలిచాయని ఆయన తెలిపారు. సెకండరీ స్థాయి సైన్స్ క్విజ్ పోటీల్లో నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రథమ, పాతపొన్నటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచాయని శ్రీనివాసరావు తెలిపారు. ప్రోజెక్ట్ వర్క్స్ విభాగంలో పారాపురం, వక్తృత్వ చర్చ పోటీల్లో మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెలుపొందాయని ఆయన అన్నారు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఎల్.రమణయ్య, కె.శాంతారావు, కె.చంద్రకాంత్, కె.మధుసూదనరావు, బి.నాగయ్య, బండి అమల, సి.హెచ్.సురేష్ బాబు, జి.సీతారాం, ఎస్.రాజేష్ కుమార్, ఎం.వరదరాజులు, ఎం.రాజు, పి.రాజు తదితరులు సైన్స్ ఆవశ్యకత గూర్చి ప్రసంగించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి