సుప్రభాత కవిత : -బృంద
అందమైన భావనలకు 
అక్షర రూపమిస్తే 
ఒద్దికగా అమరిన మాటలకు 
ఇంపైన అర్థం ఉంటే.... అది అందం

అపుడే విచ్చిన రేకులపై 
లేత వెలుగు కిరణాలు పడి 
కొత్త మెరుపేదో మెరిసినట్టు 
వింత సొగసులు కనపడితే... అందం

జగతినంతా వెలిగించు భానుడు 
తన దరికి వచ్చి ప్రేమగా
కుశలమడిగిన వైనానికి
సంబరపడ్డ సుమదళపుసంతోషం.. అందం

మదిలో పొంగే ప్రేమ 
కనుచూపుల సాయంతో 
సొంతదారుకు చేరవేస్తే 
అందుకున్న మనసు పెదవులపై నవ్వు.. అందం

అలుపొచ్చేదాకా ఉయ్యాలూపి
చిన్ని తండ్రి బజ్జున్నాడని
తొంగి చూసే అమ్మను చూసి 
చల్లగ నవ్వే బిడ్డ  అల్లరి.... అందం

నిన్న లేని సంతోషాలు
రేపు తప్పక అందేనని 
నేడు కలిగే ఊహలు  ఇచ్చే
ఆశ ఇచ్చే హాయి.... అందం

మెల్లగ వచ్చే తెల్లని వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు