గిరుల మాటున భానుబింబము
తొంగి చూడగానే
తుహిన గిరుల జాలువారే
కనక రజనుల ధారలే!
హిమబిందువుల పై వాలే
కాంతి కిరణపు పరావర్తనము
నింగినున్న జలదాలకు
బంగరు రంగు అలదే!
తూరుపున వేంచేయు
వేలుపు రాకతో
వెలుగులను కౌగిలించి
పుడమి పుత్తడిగ మారె!
స్వేచ్ఛగా విరిసిన పువ్వుల
స్వచ్ఛమైన నవ్వుల చేరి
పచ్చనైన ప్రకృతి మెడకు
పచ్చల ఆభరణమాయె!
నేలపై కురిసిన కాంతి
నలుదిక్కులకు పాకీ
పలు సోయగములను
వెలువరించ కన్నుల విందాయె!
ఎగసిన మనసుకు
వెన్నెలమాపుగా అందె
ఎదురుచూసిన క్షణము
చెదిరిపోకుండగా.......
కుదురైన మనసున
ఎదురులేని సంబరాలు
బెదురులేక జరిపించు
మధురమైన వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి