కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాలు ఇటీవల ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందుకు అనుగుణంగా, వచ్చే విద్యా సంవత్సరం నుండే ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రారంభించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోంది.అయినా ఆయా దేశాల నుండి మనం స్పూర్తి పొందకపోవడం దురదృష్టకరం.
మనం మొట్టమొదట నేర్చుకునేదీ, బాగా ఎక్కువగా మాట్లాడేదీ, ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ, భావావేశ, లేదా హృదయా నుగత సంబంధం కలిగినదీ, లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు.
మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి. మాతృభాష మాధ్యమం వల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది. సామాజిక స్పృహ పెంపొందుతుంది.
2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదవ తరగతి వరకు మాతృభాష లోనే బోధన జరగాలి అని చెబుతోంది. మాతృభాషలో విద్యా బోధన వల్ల విద్యార్థికి బోధన అంశం సమగ్రంగా అర్థమవుతుంది.
తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి సహకరించాలి.మాతృభాషా మాధ్యమానికి ప్రాధాన్యతనిస్తూ దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసి మాతృభాషా మాధ్యమంలోనే విద్యా బోధన జరిగేటట్లు ప్రభుత్వం, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృభాషలు మనగలుగుతాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి