తెలుగు పరిరక్షణ మన బాధ్యత:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
నా భాష తెలుగురా!
నా కంటి వెలుగురా!
రాయలు కాలంలో
గొప్పగా వెలిగెరా!

బహు ఘనం భాషల్లో
చక్కనిది పదముల్లో
జిహ్వకెంతో మధురము
ఇష్టపడును! అధరము

సంగీతానికనువు
తీపికెంతో నెలవు
నా తెలుగు భాషలో
మేలులెన్నో కలవు

తల్లి వంటిది తెలుగు
మల్లెల వోలె తెలుపు
మాతృభాష బ్రతుకున
చేకూర్చునోయ్!గెలుపు

అమ్మ భాష కోసము
పరితపించు! అనిశము
తెలుగు పరిరక్షణకై
చీమల దండు అగుము


కామెంట్‌లు