దేశంలోని అధిక ధరల పోటు ఆర్ధిక వ్యవస్థను మందగించేలా చేస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడంతో ఆ ప్రభావం వృద్ధి రేటుపై స్పష్టంగా కనబడుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లో జిడిపి 6.4 శాతానికి పరిమితం కానుందని అంచనా వేస్తూ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ద్రవ్యోల్బణపు ధరల మంట కారణంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును మందగమనంలోకి నెట్టింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తులు, సరుకుల ధరలు మండిపోవడం వల్ల ప్రజలు ఖర్చులను తగ్గించారు.ఒకవైపు ప్రజల జీత భత్యాలు ఆశీంచిన స్థ్శ్యిలో పెరగడం లేదు, మరొకవైపు నిత్యావసర సరుకుల ధరలతో పాటు వైద్యం ఖర్చులు కూడా ఆకాశయానం చేస్తున్నాయి. ప్రజలు ఓరుగుతున్న జీవన వ్యయం భరించలేక అప్పులపాలవుతున్నారు. ప్రజల సమస్యలు ఇలా ఉంటే వ్యాపారులు బాధలు మరోలా ఉన్నాయి. ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని, ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే.. ఒకవేళ వాటి ధరలు తగ్గితే తాము నష్టపోతామనే భయంలో ఉన్నామని చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసే సరుకులు మోతాదు తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బుతింటున్నాయని వాపోతున్నారు.రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు నెలల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే.. పప్పు, ఉప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏమి తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు.
దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని, అకలి కేకలను, నిరుద్యోగం, ఉపాధి రహిత పరిస్థితులను అనేక జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఎత్తి చూపినా నేతలు, ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.. ప్రభుత్వ ఖర్చును, ముఖ్యంగా పేదల కోసం చేసే ఖర్చును భారీగా పెంచాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎందరో నిపుణులు, ఆర్థిక వేత్తలు చేసిన సూచనలన్నీ బుట్టదాఖలు అవుతున్నాయి
అధిక ధరల పోటు:-సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి