అమ్మ :- :- ఎం యజ్ఞశ్రీ - తొమ్మిద 'వ తరగతి-జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నర్మెట్ట.-జనగామ జిల్లా
 ఇంటికి వెలుగు అమ్మ
     ఇంటికి దీపం అమ్మ
 అమ్మ మన కోసం చేస్తుంది కష్టం
 అమ్మకి మనం చాలా ఇష్టం

మనకి ఏ ఆపద వచ్చిన తట్టుకోదు అమ్మ
 మనకి ప్రేమను పంచుతుంది అమ్మ

 మాకు ప్రేమ కురిపిస్తుంది మా  అమ్మ
 ప్రేమకు రూపం అంటేనే మా అమ్మ

 ఇంటికి దేవత మా అమ్మ
 మా ఇంటికి మహారాణి మా అమ్మ 

అమ్మ దేవతతో సమానం
    అమ్మ నాకు  ప్రాణం

అమ్మా!నీ కోసం రాస్తా ఓ కవిత.
 నీ మీద ఎంత ఇష్టమో చెబుతా.

 మాకు దేవుడిచ్చిన వరం అమ్మ
 మాకు చాలా ఇష్టం  మా అమ్మ. 


కామెంట్‌లు