న్యాయములు -811
"ఆపరాద్ధేషో రివ ధానుష్కస్య కంఠాడంబరః న్యాయము"
******
అపరా అంటే తక్కువ,అధో, అంతకు మించీ లేదా తర్వాత ఏమీ లేదు.రివ అనగా నది, కట్టబడినది,ధానుష్కస్య అనగా బాణమును సంధించు వానికి.కంఠాడంబరః అధికమైన మాటలు అని అర్థము.
"బాణము గురి తప్పుచు ఉండు ధనుర్ధరునికి వాగాడంబరము వలె" అని అర్థము.
బాణం వేయడంలో ఏకాగ్రత లేదు కానీ మాటలు మాత్రం బాగా చెప్పేవాడిని ఉద్ధేశించి ఈ న్యాయము చెప్పబడింది. దీనినే తెలుగులో మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే "ఒట్టి గొడ్డుకు అఱపు లెక్కువ'"అని అన్నారు. బాణం గురి తప్పుతోంది అంటే అతడు అభ్యసనంలో వెనుకబడ్డాడని అర్థము .
అలాగే సంతాన యోగ్యత లేని గొడ్రాలు ఆవు ఆకలికి అరిచినా దానిని ఇష్టపడక వ్యంగ్యంగా అనే మాట ఇది.మరి శ్లోకం మొత్తాన్ని చూద్దాం.
"అనిర్లోడిత కార్యస్య వాగ్జాలం వాగ్మినో వృథా/నిమిత్తా దపరాద్ధేషో ర్ధానుష్క స్యేవ వల్గితమ్ "
అనగా కార్య శూరుడు కానివాని అధిక ప్రలాపము వ్యర్థమని భావము.అనగా ఒట్టి గొడ్డుకు అఱపు లెక్కువ'. ,(ఆ అరుపులు కేవలము నిష్ప్రయోజనములు.) అని భావము.
పని బాగా చేసేవాడు తక్కువ మాట్లాడుతాడు. తక్కువ పని చేసేవాడు ఎక్కువగా లేదా అతిగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రగల్భాలు పలికే వాడు సోమరిగా ఉండటానికి ఇష్టపడతాడు.
వాక్కును ఎప్పుడూ ఆభరణంగానే ఉపయోగించుకోవాలి కానీ ఆడంబరానికి చిహ్నంగా వాడకూడదు.
అధికంగా మాట్లాడే వ్యక్తులను ఎవరూ ఖాతరు చేయరు. అందులోనూ నేర్చుకోవడంలో వెనుకబడి ఉంటే దాని కారణాలు వెతుక్కోవాలి.అంతే కానీ వాగాడంబరం కూడదు అని అర్థము.
ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం మన చుట్టూ ఉన్న వాళ్ళే. వాళ్ళలో కొందరు వ్యక్తులు ఇలా లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. అందుకే అలాంటి వారిని చూసి చెడిపోకండని ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కాబట్టి మన మాటలు,చేతలు గొడ్డుటావు లాంటివి కావు పాడి ఆవుల సేవల వంటివి అని ఋజువు చేసుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి