సోము చదువులో చాలా వెనుకబడినాడు. ఎప్పుడూ ఉపాధ్యాయులతో చివాట్లు. ఇంట్లో తల్లిదండ్రులతో చివాట్లు. ఎన్ని దెబ్బలు తిన్నా సోములో చదవాలన్న కోరిక రావడం లేదు.
ఒకసారి పరీక్షలలో చాలా తక్కువ మార్కులు వచ్చాయని ఉపాధ్యాయులు దండించారు. ఆ తర్వాత సోము క్లాస్ మేట్ రాము సోము వద్ద చేరి "ఎందుకురా ఇలా అందరి చేత తరచూ దెబ్బలు తింటావు. ప్రయత్నం చేయవచ్చు కదా! ఇంటి దగ్గర ఎందుకు చదవవు?" అన్నాడు. అప్పుడు సోము ఇలా అన్నాడు. "ఒకసారి నా జాతకం చూపించుకున్నా. జాతకం చెప్పేవాడు నాకు జన్మలో చదువు రాదు. పేదరికంలో బతుకుతా అని చెప్పాడు. నా జాతకం ఇంతే. నాకు చదువుకునే రాత బ్రహ్మ ఇవ్వలేదు." అని విచారంగా అన్నాడు.
అక్కడే ఉన్న వాసు పగలబడి నవ్వాడు. "ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగాడు సోము. అప్పుడు వాసు ఇలా అన్నాడు. "మన జాతకం రాసుకునేది మనమే. మన చేతులలోనే మన జాతకం ఉంది. చదువు రాకపోవడానికి కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడం. మన మీద మనం నమ్మకం పెట్టుకొని, పట్టుదలతో నిరంతరం కృషి చేస్తే మనం ఎంత గొప్పవారిమి అయినా అవుతాము. చదువును నిర్లక్ష్యం చేసేవారు చేజేతులా తమ భవిష్యత్తును చెడగొట్టుకుంటారు. కావాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చెయ్యి. మేమంతా నీకు సహాయం చేస్తాము." అన్నాడు వాసు. అప్పుడే అక్కడికి వచ్చి ఈ మాటలు వింటున్న వేంకటేశం మాస్టారు "బాబూ! వాసు చెప్పింది నిజమే. మన రాతను ఎవరూ రాయరు. మనమే రాసుకోగలం." అని అన్నారు. సోముకు కనువిప్పు కలిగింది. పట్టుదలతో కృషి చేసి ఉన్నత స్థాయికి చేరాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి