కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా SLC, సైన్స్ ప్రోగ్రాం.


 స్థానిక కె.వి.ఆర్ గార్డెన్స్ కె.వి.ఆర్ పాఠశాలలో ఏర్పాటు  చేసిన SLC (స్టూడెంట్ లిడ్ కాన్ఫరెన్స్) సైన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడం జరిగింది.విద్యార్థులు ప్రయోగత్మాకంగా తయారు చేసిన సైన్స్ పరికరాలను, అన్ని సబ్జెక్ట్స్ వారిగా ఈ సైన్స్ ప్రోగ్రాంలో ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యల జిల్లా అధ్యక్షులు,వికాస్ స్కూల్ ప్రిన్సిపాల్ యుగంధర్,సిరాక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇబ్రహీం,అపుస్మా కార్యదర్శి షాహీధ,కె.వి.ఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి,లీడ్ జిల్లా ఇంచార్జ్ ముజామిళ్,తదితరులు విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగత్మక సైన్స్ పరికరాలను సందర్శించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు..మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున సైన్స్ ప్రతిభను వెలికి తీయడానికి, వారిలో నూతన ఉత్సహని  పెంపోందించడానికి,విద్యార్థుల్లో చదువు పట్ల శ్రద్ధ పెంచడానికి ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో  దోహద పడతాయని తెలియజేయండి జరిగింది.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు