పుస్తక ప్రపంచం20 - సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 అమెరికన్ రచయిత హెర్మెన్ మెల్విలె రాసిన "మాబీడిక్"లో సముద్రంలోని జలచరం తెల్ల వేల్ ప్రాణి పేరు.సముద్రపు కథగా "వేలింగ్ షిప్_పెఖోడ్" ఆఖరి ప్రయాణంగా కథ సాగింది.నౌక కెప్టెన్ ఆహబ్ వేల్ ప్రాణి కథ ఇది.ఛార్లెస్ డార్విన్ రాసిన "ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్" సైన్స్ ప్రపంచంలో విజ్ఞాన ఖని !1831లో తన ఓడ"
హెచ్ ఎం.ఎస్.బీగిల్"లో బైలుదేరి రకరకాల  జంతువుల పై పరిశోధన చేసినవాడు.మనిషి కోతి నుంచి పుట్టి కాలక్రమేణ మనిషిగా మారాడని,  ఆనాటి సంఘం మతంలో ఉన్న మూఢనమ్మకాలని చిత్తు చేశాడు .డార్విన్ సిద్ధాంతం ఆనాటి ప్రపంచాన్ని ఓఊపు ఊపి
సైన్స్ లో కొత్త ఆలోచనలకు ప్రేరణ కలిగించింది.ఆంగ్ల సాహిత్యంలో"క్లారిసా" మిలియన్ పదాలున్న నవలగా చరిత్ర సృష్టించింది.శామ్యూల్ రిచర్డ్ సన్ రాసిన ఈనవలలో పాత్రలన్నీ లేఖల ద్వారా కథను నడిపిస్తాయి. కొన్ని లేఖలు సుదీర్ఘంగా అనిపిస్తాయి. పాఠకుల సహనాన్ని పరీక్షిస్తాయి🌹
కామెంట్‌లు