అప్ ఫ్రం స్లేవరీ రచయిత బుకర్ టి.వాషింగ్టన్ ఒక బానిస పుట్టుకతోనే. 1856 లో పుట్టిన ఈయన బొగ్గుగనుల్లో చిన్నారికూలీగా ఎన్నో అగచాట్లు పడ్డాడు.రాత్రిపూట కూర్చుని స్వయంగా చదువునేర్చుకుని ఓసంస్థకు అధిపతి ఐనాడు.విద్య తోటే ఆర్ధిక పరిస్థితులు బాగుపడ్తాయని నమ్మాడు. అలా తనపుస్తకంలో ఇదంతా రాశాడు.అలా ఆఫ్రికన్ అమెరికన్స్ లో చైతన్యం తెచ్చిన రచయిత గా గణుతికెక్కాడు.1880లో పుట్టిన హెలెన్ కెల్లర్ పసిప్రాయంలో చూపు వినికిడి శక్తి కోల్పోయింది.బ్రెయిలీ లిపి నేర్చుకుని కాలేజీలో చదివి* దిస్టోరీ ఆఫ్ మైలైఫ్* రాసి దివ్యాంగుల పాలిట ఆశాజ్యోతిగా మారింది.ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారి మొహం గాత్రాన్ని చేతులతో తడుముతూ ప్రశంసించిన హెలెన్ అద్భుత వనిత. 1903 లో విడుదలైన "ది కాల్ ఆఫ్ ది వైల్డ్" రచయిత జాన్ లండన్.స్లెడ్ డాగ్ బక్ జీవన మరణ సమస్యలు,మంచుతో నిండిన ఆర్కిటిక్ ప్రాంతం పాఠకుల్ని చదివిస్తుంది ఉత్కంఠ రేపుతుంది.రచయిత సాహసయాత్ర ఆనాటి ఇంగ్లీషుప్రాంతంలోని మురికివాడలు, లండన్ లో సామాజిక పరిస్థితులకు దర్పణం ఈపుస్తకం.భూస్వాముల బడుగుల మధ్య సంఘర్షణ ఆటుపోట్లను,ఆర్కిటిక్ అందాలను చిత్రించాడు.🌹
పుస్తక ప్రపంచం27 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి