సర్వర్తుకుసుమామోదమోదితే సుమనోహరే ।
శైత్యసౌగంధ్యమాంద్యాఢ్యమరుద్భిరుపవీజితే ॥ 3 ॥
అప్సరోగణసంగీతకలధ్వనినినాదితే ।
స్థిరచ్ఛాయాద్రుమచ్ఛాయాచ్ఛాదితే స్నిగ్ధమంజులే
ఒక సందర్భం లో మహారాష్ట్ర లోని పునా జిల్లాలో కొలువై వున్న ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన భీమా శంకరాలయం లో నివసించే ఒక గొప్ప సాధు పుంగవుడిని గాడ్గిల్ తరచుగా దర్శిస్తూ ఆయనను తగిన విధంగా కొలుచుకుంటూ ఆశీర్వాదములను అందుకుంటూ వుండేవాడు. ఒకసారి తన అద్యాత్మిక సాధన ఎంతకూ ముందుకు సాగడం లేదన్న బాధను వ్యక్తం చేయగా ఆ సాధుపుంగవులు “నేను చేయగలిగింది నా శక్తి సామర్ధ్యాల మేరకు చేసాను. ఇక నుండి నిన్ను ఉద్దరించి నీ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చవలసింది శిరిడీ లో కొలువైవున్న శ్రీ సాయినాధులే కనుక సత్వరమే వెళ్ళి ఆ మహనీయుని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించి తరించు” అని ఆయన సలహా ఇచ్చారు. ఆ ప్రకారంగానే గాడ్గిల్ శిరిడీ బయలుదేరగా దారిలో రైలులో తోటి ప్రయాణీకులు సాయి మంత తంత్ర ఇంద్రజాల విద్యలు నేర్చిన ఒక పిచ్చి ఫకీరు అని ఆయనను దర్శించడం వలన వీసమెత్తు ప్రయోజనం కూడా లేదని అన్నారు. చెప్పుడు మాటలు మానవులపై పెను ప్రభావాన్ని చూపుతాయి. వారి మాటలకు ఒకింత చింత పడిన గాడ్గిల్ తాను అనవసరంగా శిరిడీ వెళ్ళ్తున్నానని, అంతకంటే భీమా శంకరాలయం లో వేంచేసిన ఆ సాధు పుంగవుని దర్శిస్తే పోయేదని అనుకున్నాడు. అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు శిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకునేందుకు మశీదులో అడుగు పెట్తబోయేంతలో సాయి తీవ్రమైన ఆగ్రహంతో “ నువ్వు ఈ మశీదులోనికి రావద్దు. మంత్ర, తంత్ర, ఇంద్రజాల విద్యలను నేర్చిన ఈ పిచ్చి ఫకీరును చూడడమెందుకు ? అంత కంటే భీమా శంకరాలయం లో వున్న ఆ సాధువు కాళ్ళ మీదే పడు” అని అరిచారు. ఆ మాటలకు గాడ్గిల్ బిత్తరపోయడు. శిరిడీ కి ఎన్నో మైళ్ళ దూరం లో నిన్న జరిగిన సంఘటన శ్రీ సాయికి ఎలా తెలుసు? దీనిని బట్టి శ్రీ సాయి సామాన్యులు కాదని సర్వం తెలుసుకొనే భగవంతుడనే అవగాహనకు వచ్చాడు. ఆ తర్వాత శిరిడీ లో మిగితా భక్తుల అనుభవాలను విని అతని మనసు మారిపోయింది. శ్రీ సాయి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు అలవడ్డాయి. మనసులో సంశయాత్మక ధోరణి తొలగిపోయాక శ్రీ సాయి గాడ్గిల్ ను పిలిచి ఉదీ ప్రసాదాలతో ఆశీర్వదించారు.సంశయాత్మక ధోరణి, తమ అనుభవాలను అంటిపెట్టుకొని వుండక, ఇతరుల మాటలను విని ప్రభావితం అయ్యే ధోరణి మానవులను అధమ పాతాళానికి తొక్కి వేస్తుందని ఈ లీల ద్వారా శ్రీ సాయినాధులు మనకు బోధించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి