యస్య శ్రవణ మాత్రేణ దేహీ దుఃఖాద్విముచ్యతే
యేన మార్గేణ మునయః సర్వఙ్ఞత్వం ప్రపేదిరే 3
యత్ప్రాప్య న పునర్యాతి నరః సంసార బంధనం
తథా విధం పరం తత్వం వక్తవ్య మధునా త్వయా
ఒకసారి బొంబాయి భక్తుడొకరు శిరిడీ వచ్చి సాయిని దర్శనం చేసుకోలేని కారణంగా బాబాకు దక్షిణగా అందజేయమని చెప్పి రెండు రూపాయలను మనీ ఆర్డర్ ద్వారా శ్యామా పేరిట పంపాడు. పోస్ట్ మాన్ ఆ మనీ అర్డరును తీసుకువచ్చే సమయనికి మసీదులో శ్యామా తప్ప ఎవ్వరూ లేరు కనుక శ్రీ సాయికి ఈ విషయం తెలిసే అవకాశం లేదు. తాను రేయింబవళ్ళూ సహచర్యం చేస్తున్న సాయి సర్వజ్ఞతత ఎంతటిదో పరీక్షించుదామని అనుకున్న శ్యామా ఆ రెండు కాసులను మశీదులో ఒక చొట పాతిపెట్టాడు. ఆ సంగతి ఇంకెవ్వరికీ చెప్పలేదు.
కొద్ది రోజుల తర్వాత ఒక భక్తుడు వచ్చి తనకు రైలు చార్జీల కోసం రెండు రూపాయలను సహాయం చెయ్యమని శ్రీ సాయిని కోరాడు. శ్రీ సాయి ఒక మశీదులో ప్రదేశం చూపించి అక్కడ తవ్వమన్నారు. మొదట తవ్వగా రెండు రూపాయల కాసులు దొరికాయి, ఇంకా కాసులు దొరుకుతాయేమోనన్న ఆశతో అతను ఒక పలుగు తెచ్చి తవ్వడం ప్రారంభించగా సాయి చిరునవ్వుతో అతనిని నివారించారు. “నాయనా ! నువ్వు రెండు రూపాయలు అడిగావు, అవి నీకు దొరికాయి. ఇంకా దొరుకుతాయన్న అత్యాశతో తవ్వడం సరి కాదు. దురాశ దుఖానికి చేటు. సంతృప్తియే ఆనందమయ జీవనానికి సాపానం. అక్కడ నువ్వు కందకం తవ్వినా ఒక్క నయా పైస కూడా దొరకదు” అని అన్నారు. దాంతో ఆ భక్తుడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు.
ఆరు నెలల తర్వాత శ్యామా ఇంట్లో దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. శ్యామా ఏడుస్తూ సాయి కాళ్ళపై పడి తనకు తన సంపదలు తిరిగి ఇప్పించమని ప్రార్ధించాడు.
అప్పుడు శ్రీ సాయి చిరునవ్వుతో “ఓయీ శ్యామా, నీ ఇంట్లో దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా వున్నాను. నావి రెండు రూపాయలు ఆర్నెల్ల కింద పోయాయి, మరి నేనెవరితో చెప్పుకోను” అని అన్నారు.
అందుకు శ్యామాకు ఉక్రోష మరింత పెరిగింది.బాబాయే ఏదో కావాలని చేసారన్న భావనతో ” నీవి కేవలం రెండు రూపాయలే గా పోయాయి, మరి నావైతే ఇరవై వేల దాకా పోయింది” అని అన్నాడు.
అందుకు సాయి మరింత ప్రసన్నంగా “ నీలాంటి ప్రభుత్వ ఉద్యోగికి ఇరవై వేలు ఎంతో నా లాంటి పేద ఫకీరుకు రెండు రూపాయలు అంత.చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నారు. మన స్థాయికి తగ్గట్టే కర్మ సూత్రం అనుభవమవుతుంది.ముందుగా కర్మ సూత్రాన్ని అర్ధం చేసుకో శ్యామా ” అని అన్నారు.
ఆ మాటలకు శ్యామాకు జ్ఞానోదయమయ్యింది. పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయిన తన సమర్ధ సద్గురువు శ్రీ సాయితోనే పరాచకాలాడిన విషయం గుర్తొచ్చింది.తన అజ్ఞానానికి పశ్చాత్తాప పడి తనను క్షమించమని శ్రీ సాయిని హృదయపూర్వకం గా వేడుకున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి