గువ్వ పిట్టలు వచ్చాయి
గవ్వలు కొన్ని తెచ్చాయి
అవ్వ ఒడిలో పోశాయి
గాయి గాయి చేశాయి
అవ్వ తవ్వ తెచ్చింది
గవ్వలు తవ్వలు పోసిందే
రివ్వున పిల్లలు వచ్చారు
తవ్వలో గవ్వలు చూశారు
ఒక్కొక్క గవ్వ తీశారు
గమ్ము పెట్టి పెట్టారు
గంపచుట్టు అతికారు
కొట్టు లోకి పంపారు
కోటి రొక్కం ఇచ్చారు
గవ్వల గంపను కొన్నారు
కోటి పువ్వులు నింపారు
కోవెలకు వారు పంపారు
గంపల పువ్వులు తీశారు
దేవికి పూజలు చేశారు
చేతులెత్తి మొక్కారు
అమ్మోరి దీవెనలొందారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి