బ్యారెల్ క్యాక్ టస్ అనే మొక్క మెక్సికో దేశంలో ఉంది. ఇది 18 నుంచి 20 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది ఎడారి మొక్క ఈ మొక్క ఎక్కువ మొత్తంలో నీటిని తనలో దాచుకుని ఉంటుంది. విపరీతమైన ఎండాకాలంలో కూడా ఈ మొక్క స్వయంగా పూలను, పండ్లను తయారు చేసుకోగలదు. ఎందుకంటే ఈ మొక్కలో ఎక్కువ మోతాదులో మీరు నిలువ ఉంటుంది. దీని ముళ్ళు చాలా ఈ మొక్కలకు రక్షణగా ఉంటాయి. ఎడారి ప్రాంతంలో మీరు లభించక జంతువులు వీటి దగ్గరికి నీటి కోసం వచ్చినప్పుడు ఈ బలమైన ముళ్ళు వాటిని రక్షిస్తాయి. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని ఎడారుల్లో కనిపిస్తాయి.
బ్యారెల్ క్యాక్టస్ మొక్క. :- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి