న్యాయములు-823
"ఉదర నిమిత్తో బహుకృత వేషః "న్యాయము
*****
ఉదరం అనగా కడుపు.నిమిత్త అనగా దేనికైనా కారణం. బహుకృత అనగా అనేక రకాల.వేష అనగా వేషం అనే అర్థాలు ఉన్నాయి.
ఏ వేషము వేసినా కడుపు కూటి కొరకే. అనగా "కోటి విద్యలు కూటి కొరకే"అని తెలుగు సామెత. కడుపు నింపుకోవడం కోసం ఏదైనా వేషం ధరిస్తారని భావన. కడుపు నిండా తిండి కోసం వేషాలు ధరించడం అనే అర్థమును ఈ న్యాయము సూచిస్తుంది. ఈ వాక్యం ఆదిశంకరులు రచించిన భజ గోవిందంలో ఉండటం విశేషం.
"జటిలో ముండిలు ఇన్చిత కేశః/ కాషాయంబర బహుకృత వేషః'.. అనీ
పశ్యన్నపి చన పశ్యతి మూఢః/ఉదర నిమిత్తం బహుకృత వేషః"- అని వుంది.
మరి ఈ వేషాలు ధరించేది పురుషులే.ఈ భిన్న వేషధారణలన్నీ కడుపు నింపుకోవడం కోసమే.
అనగా ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా చివరకు బతుకు తెరువు కోసమే అని మనకు అర్థం అవుతుంది. పెద్దవాళ్ళు తరచూ అంటుంటారు "ఐదు వేళ్ళూ నోట్లోకి పోవాలంటే ఏదో ఒక పని చేయాల్సిందేనీ.ఇల్లన్న తర్వాత ఇల్లాలు, పిల్లలు ఉంటారు.పూటకు నాలుగైదు కంచాల చొప్పున రోజుకు పదిహేను కంచాలు/ విస్తర్లు లేవ వలసిందే. అవి లేవాలి అంటే ఇంటి యజమాని ఏదో ఒక పనిని చేయాలి తప్పదు.
ఇక్కడ వేషం అంటే పగటి వేషమో, సినిమా వేషమో అని కాదు. పొలాల్లో చేసే కూలీలుగా, బండలు మోసే శ్రామికులుగా, వ్యవసాయం చేసే రైతులుగా, బట్టలు నేసే నేతన్నలుగా..ఇలా రకరకాల వృత్తులు, ఉద్యోగాలు చేసే వారి పాత్రలు.
ఇంకా తేలికగా చెప్పాలంటే అనగా ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవన రంగస్థలం మీద తనకు ఇచ్చిన పాత్రను పోషించాల్సిందే. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి అనేక రకాల పాత్రలు పోషిస్తాడు. మనిషి తన మనుగడ సాగించాలి అంటే రకరకాల వృత్తుల వేషాలు వేయాలి.
అసలు మనిషి బతకాలంటే ఏం కావాలి?.: పీల్చే గాలితో తాగేందుకు నీళ్లు కావాలి.ఉండేందుకు నీడ కావాలి.కట్టుకునేందుకు బట్టలు కావాలి. బతికి బట్ట కట్టేందుకు అనగా ముఖ్యంగా తినడానికి ఆహార పదార్థాలు కావాలి. మరి ఇవన్నీ సమకూర్చుకునేందుకు ఏదో ఒక పని చిన్నదో పెద్దదో పనిని చేయాలి కదా!.
యజమాని కిందనో, తోటి సహాయకుడిగి గానో, స్వయం ఉపాధి, ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో ఇలా ఏదైనా పని చేయాలి .ఇలా తమ అవసరాలను, కోరికలను తీర్చుకోవడానికి ముఖ్యంగా జీవనోపాధి కోసం వివిధ పాత్రలు స్వీకరిస్తారు.వేర్వేరు విద్యలు నేర్చుకుంటారు .
సమాజంలో ఎవరు ఎలాంటి విద్యలు నేర్చుకున్నా చివరకు అవి ఉదర పోషణార్థమే. "పైసాలోనే పరమాత్మ"అని. పైసలు ఉంటేనే పరమాత్మ ఇచ్చిన జీవిని సక్రమంగా పోషించడానికే.
బహుకృత వేషః అని ఎందుకు అన్నారంటే...పూర్వకాలంలో చాలా మందికి దున్నడానికి భూములు ఉండేవి కావు.భూస్వాములు,దొరల చేతుల్లో ఉండడం వల్ల వాటిల్లో కూలీలుగా పనులు చేస్తూ ఉండేవారు. అలా చేయడం వల్ల వారికి కడుపు నిండేది కాదు. చతుష్షష్టి కళల్లో ఏదో ఒక కళను కూడా నేర్చుకుని ప్రదర్శించి తద్వారా ఆనందాన్ని ఆదాయాన్ని పొందేవారు.అలా బహుకృత వేషం అనే పేరు వచ్చింది.
ఇదండీ ఉదర నిమిత్తో బహుకృత వేషః న్యాయము లోని కథా కమామీషు.బతకడానికి ఏ వేషం వేసినా అందులో విలువలు ఉంటే గౌరవింపబడుతారు.అది గ్రహించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి