వెలకట్టలేని విలువైన అక్షర మణులతో...
జ్ఞాన శిల్పులు చెక్కిన, విజ్ఞాన భండారములు!
వ్యక్తిత్వ వికాస సంస్కార భూషణములు ..!
గౌరవమును పెంచు సంపదలివి...!!
సమాజమును పెడత్రోవ పడనీక సన్మార్గమును జూ పు దిక్సూచి లీ పుస్తకములు...!
తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత గురునివాత్సల్యము, మిత్రుని యాభిమానము కలగలిసి రూపుదాల్చినవియే...
మంచి పుస్తకములు...!
పుస్తకమును ప్రేమించు...
శ్రధ్ధగా పఠించి....
అధ్యయనము గావించు
బుద్ధిగా ఆచరించు...!
ఉన్నత స్థితిని బొంది, సన్మాన సత్కారము లంది
ఎనలేని ఆనందమును బొందు.....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి