ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్త నిర్వహణలో విశ్వా వసు ఉగాది వేడుకలు ఘనంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కవిబ్రహ్మ తిక్కన భవనంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఓ. ఆనంద్ ఐ. ఏ. ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ బడ్డాయి. తొలుత మంగళ వాయిద్యాలతో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్, జిల్లా రెవిన్యూ అధికారిజే. ఉదయభాస్కర్ రావు, నెల్లూరు ఆర్డీవో అనూష, నగర మేయర్ పొట్లూరు స్రవంతి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. బాలాజీ రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కే. సదా రావు, శ్రీ. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల,నెల్లూరు ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోతిర్మయి తదితరులకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణం, సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరచిన పదకొండు మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించి వారిని శాలువ, జ్ఞాపిక,పుష్ప గుచ్ఛం, 1000/- నగదుతో విశ్వావసు ఉగాది పురస్కారాలు-2025ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు శ్రీయుతులు మోపూరు పెంచల నరసింహం, గుండాల నరేంద్ర బాబు, అవ్వారు శ్రీధర్ బాబు, తిప్పవజ్జుల నరసింహ మూర్తి, గండికోట సుధీర్ కుమార్, మాటేటి రత్న ప్రసాద్, అలెగ్జాoడర్, గోవిందరాజు సుభద్రాదేవి, పాతూరి అన్నపూర్ణ, తోట సులోచన,ములుగు లక్ష్మీ మైధిలి. పంచాంగ శ్రవణం ఆలూరి శిరోమణి శర్మ నిర్వహించారు. కవి సమ్మేళనం ఆహుతులను అలరించింది. సభకు హాజరైన వారికి ఉగాది పచ్చడి, స్వీట్ బాక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
గుండాల నరేంద్ర బాబు 1991 నుంచి కవితలు రాస్తున్నారు. జవహర్ భారతి కళాశాల, కావలిలో చదివే రోజుల్లో కళాశాల సంచిక కోసం మొదటి సారిగా రాసిన "జీవితం" అనే కవిత కళాశాల సంచికలో ముద్రించబడింది. అప్పటి నుంచి వీరు రాసిన పలు కవితలు ఆంధ్ర జ్యోతి, ఈనాడు, వార్త, సూర్య, వార్త,ఆంధ్ర భూమి, ప్రజా శక్తి, విశాలాంధ్ర,సాక్షి, ఆంధ్ర ప్రభ, పున్నమి, కోస్తా ప్రభ,తెలుగు లోకం, వార్తాప్రభ,భూమి పుత్ర,నవ తెలంగాణ తదితర దిన పత్రికలు,జమీన్ రైతు, లాయర్, ఆంధ్ర భూమి,ప్రజా తంత్ర, సామూహిక వంటి వారపత్రికలు, నేటి నిజం, ప్రసారిక, చిన్నారి నేస్తం వంటి మాస పత్రికల్లో వీరి కవితలు, ప్రచురించబడి పాఠకుల మన్ననలందుకున్నవి. సాక్షి ఫండే ఆదివారం సంచిక, వార్త ఆదివారం అనుబంధం, మొలక బాల సాహిత్య పత్రిక ల్లో వీరు చిన్నారుల కొరకు రచించిన బాల గేయాలు ప్రముఖంగా ప్రచురించబడి పలువురు బాలసాహితీ వేత్తల అభినందనలు అందుకున్నవి. 'తెలుగు ప్రభ' దిన పత్రిక నందు వీరి బాలగేయాలు గురించి ప్రముఖ బాల సాహితీ వేత్త, బాలల కథా రచయిత, పైడిమర్రి రామకృష్ణ ఇటీవల ప్రముఖంగా రాస్తున్న ప్రముఖ బాల గేయాల రచయిత గుండాల నరేంద్ర బాబు గురించి ఒక ప్రత్యేక కథనం రాయడం బాల గేయాలు రాయడం వీరికున్న ప్రతిభకు నిదర్శనం.
ఇప్పటి వరకు వీరు 700 బాల గేయాలు, పలు సామాజిక అంశాలపై1000 గీతాలు రాశారు. పలు సామాజిక గీతాలు, కవితలు ఆకాశ వాణి,విజయవాడ, నెల్లూరు కేంద్రాల్లో ప్రసారం చేయబడి శ్రోతల మన్ననలు పొందాయి.
తెలుగు ఉపాధ్యాయునిగా ప్రస్తుతం కే ఎన్ ఆర్. మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ బి. వి. నగర్, నెల్లూరు నందు తెలుగు భాష బోధిస్తూ విద్యార్థుల్లో తెలుగు భాష యెడల అభిమానాన్ని ఆసక్తిని, అనురక్తిని, అభిరుచిని కగిలిస్తూ,కవిగా, రచయితగా, బాల సాహితీ వేత్తగా వ్యాఖ్యాతగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయునిగా ముఖ్యమంత్రిచే పురస్కారం- 2022 అందుకుని, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో విశిష్ట సేవలు అందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్ సి సి డైరెక్టరేట్ స్థాయిలో హైదరాబాద్ నందు ఉత్తమ ఎన్ సి సి ఆఫీసర్ అవార్డు- 2024-25 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ సి సి అధికారి నుంచి అందుకున్న గుండాల నరేంద్ర బాబు సాహిత్య రంగంలో చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఆదివారం నిర్వహించిన విశ్వా వసు ఉగాది వేడుకల్లో
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ శ్రీ ఓ. ఆనంద్ I.A.S గారి నుంచి "విశ్వా వసు ఉగాది పురస్కారం-2025"తో ఘన సత్కారం అందుకున్నారు. ఈసందర్భంగా గుండాల నరేంద్ర బాబును పలువురు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి