ఉత్తమ ఆహారం : సరికొండ శ్రీనివాసరాజు
      ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామంలో స్నేహితులు ఒక దగ్గర కూర్చుని, తాము తెచ్చిన కూరలు పంచుకుంటూ భోజనం చేయడం ఆ పాఠశాలలో జరుగుతుంది. నందినికి తన ఇంట్లో చేసిన ఏ కూరలూ నచ్చవు. నందిని తన తల్లి చేసిన కూర అందరికీ పంచుతుంది. తాను తన స్నేహితులు తెచ్చిన ఎదో ఒక కూర వసుకొని ఎదో తిన్నాను అనిపించేది. కాని నందిని ఇచ్చిన కూరలు అందరూ లొట్టలు వేసుకుని మరీ మరీ తినేవారు. ఇంత కమ్మగా మా ఇంట్లో వండరని అందరూ అంటుండే వారు. నందిని ఆశ్చర్యపోయేది. ప్రతి రోజూ ఇవే కామెంట్లు. నందినిని వదిలి పెట్టకుండా నందిని తెచ్చిన కూరలు ఎగబడి మరీ తినేవారు.
       ఒకరోజు నందిని వాళ్ళ అమ్మ గీతాంజలి స్కూలుకు వచ్చింది. ఆమె నందిని వాళ్ళ అమ్మ అని తెలిసి కొంత మంది అమ్మాయిలు చుట్టూ మూగారు. "మీ వంట అమృతం. మేమంతా పోటీలు పెట్టుకుని వడ్డించుకొని, లొట్టలు వేస్తూ తింటాము." అన్నారు. "ఒక్క నందిని తప్ప." అన్నది శ్రావణి టీచర్. ఆశ్చర్యపోయింది గీతాంజలి. "ఇంటి వద్ద కూడా ఇదే మంకు టీచర్. ఏం చేయాలి?" అంది గీతాంజలి. "మీ అమ్మాయి ఇష్టంగా తినేవి ఏమిటి?" అని అడిగింది టీచర్. 'చాక్లెట్లు, ఐస్ క్రీమ్, కుర్ కురే, లేస్, పిజ్జాలు, బర్గర్స్" ఇలా చెప్పుకుంటూ పోయింది గీతాంజలి. "అవన్నీ అనారోగ్య కారకాలు. అందుకే తినాల్సినవి తినడం లేదు. ఆ చెత్త ఫుడ్స్ కు పెట్టే ఖర్చుతో మంచి మంచి పండ్లు ఎన్నో రకాలు తినవచ్చు తెలుసా." అన్నది టీచర్
     "అందరూ ఇష్టపడే కూరలు నా కూతురికి ఎందుకు నచ్చడం లేదో తెలిసి వచ్చింది. కూతురు గుర్తించక పోయినా నా కూరలకు వచ్చిన పేరు చూస్తే సంతోషం వేస్తుంది." అంటూ అందరినీ దగ్గరకు తీసుకుని చాలాసేపు వదిలి పెట్టలేదు. గీతాంజలి కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి. సిగ్గుతో తల దించుకుంది నందిని.

కామెంట్‌లు