నోటికొచ్చింది చెబితే
వదరు
తలకుతోచింది చెబితే
దూకుడు
చూచింది చెబితే
సహజము
కల్పించింది చెబితే
భావుకత్వము
నచ్చింది చెబితే
ఇష్టము
కోరింది చెబితే
ఆశువు
సూటిగా చెబితే
సరళము
పరోక్షంగా చెబితే
పరుషము
మంచి చెబితే
హితము
విశ్లేషించి చెబితే
వర్ణనము
నవ్వించేలా చెబితే
హాస్యము
ఏడ్పించేలా చెబితే
విషాదము
గళమెత్తి చెబితే
గేయము
గాండ్రించి చెబితే
హేయము
ఓర్పుతో చెబితే
సమగ్రము
నేర్పుతో చెబితే
శ్రేష్ఠము
ప్రాసలతో చెబితే
లాలిత్యము
పొంతనలతో చెబితే
రమణీయము
మదితట్టేలా చెబితే
మనోహరము
మనసులోనిలిచేలా చెబితే
మహనీయము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి