ఈ పేరు విన్నారా....! :- కోరాడ నరసింహా రావు.
 ఈ పేరు విన్నారా... 
   ఈమె మీకు తెలుసా... 
   సావిత్రి బాయి పూలే ఈ సమాజానికి తానింకా చేయవలసింది వుండి పోయింది అన్న తపనతో మళ్లీ ఈమెగా పుట్టింది అంటున్నారు కొందరు...! 
నే నైతే... ఓ సోదరి నివేదిత, మదర్ థెరీసా, సావిత్రి బాయి పూలేల మూడు ఆత్మలూ కలిసి...
ఈ సమాజం కోసం భవిష్య ద్రష్టయై, శ్రష్ఠగా... అవత రించిన కారణ జన్మురాలు ఈమె అంటాను...!! 
మునుపెన్నడూ ఎవ్వరూఆలోచించని ఓ గొప్ప కార్యాన్ని సంకల్పించి...దాన్ని నెరవేర్చుట కొరకే జన్మిం చిన మహనీయురాలు..! 
నిస్సందే హంగా...ఆయా జన్మల ఉత్తమ సంస్కారా లన్నీ వెంట దెచ్చుకు వచ్చిందీమె ...! 
పరి పూర్ణమైన దయ, జాలి, కరుణ, ప్రేమ, సేవ... 
ఇవే ఆమె స్వభావం..! 
మంచినీ, మానవత్వాన్ని బోధించటమే ఆమె మతం! 
 మనుషుల్లో ఉత్తమ సం స్కారాలను మేల్కొల్పట మే... ఆమె లక్ష్యం...! 
  అందుకే మొట్ట మొదట ఆమె ఉపాధ్యాయ వృత్తినే ఎన్నుకుంది...!! 
   బడుగు బలహీన వర్గాలు అందుకోలేని విద్య ను వారి కందించటమే ఆమె ధ్యేయం...! 
  కుల వివక్ష, అన్యాయం ఎక్కడ చూసిన... సహించ లేని తత్వం ఆమెది...! 
  ఎదిరించి నిలదీయగల ఆత్మ స్థైర్యపు గుండె ధైర్యం ఆమె సొంతం...!
ఒక కందు కూరి , ఒక గురజాడ , ఒక జ్యోతిరావు పూలే ఆమెలో మనకు దర్శణమిస్తారు...! 
సాటి మనిషి కష్టానికి వెన్నలా కరిగిపోయే అతి సున్నిత మనస్కురాలు ఆమె...! 
ఆ మనసే... ఎనిమిదేల్ల బాలుని ఆకాల మరణాన్ని చూసి... ఆమెను ఆలోచింప జేసింది...! 
అంత వరకూ ... ఎవరో ఎక్కడో మరణా నంతరం కళ్లు మాత్రమే దానం చేసే వారు...! 
   అదే....,ఛాందస సమాజంలో చైతన్యాన్ని కలిగించి...అవయవ దానాలకు ప్రేరే పించ గలిగితే....! 
ఆమె హృదయంలో ఓ గొప్ప సంకల్పం.... 
  "మరణానంతరజీవనం"
 అవయవ,శరీరదానరూప కల్పన...! 
ఆ శ యం స్వచ్చమైనది, నిస్వార్ధమైనది, పదిమంది మేలును మాత్రమే కోరే దైతే...ఖచ్చితంగా సత్ఫలితాన్నిస్తుంది...! అదే.. జరిగింది... !! 
 ఆమె వేసిన ఆ విత్తు... మహా వృక్షమై శాఖోపశా ఖలుగా విస్త రించింది...! 
ఆమె కేవలం ఓ వ్యక్తి కాదు
 అద్భుత శక్తి...! 
   కేవలం చెప్పటం కాదు... 
 తానువర్ణా0తరవివాహాన్నిచేసుకోవటమే కాదు... 
 తమ పిల్లలవీ ఆదర్శ వివాహాలే...! 
తన సంపాదన, సమయము ఈ సమాజ సేవకు అంకితం చెయ్యటమే కాదు... 
  పిల్లలకూ ఆ సంస్కారా న్నిఅలవరచటంతో పాటు
ఆమె అడుగుజాడలలో ఎందరినో సేవా తత్పరతతో తరింపజేసిన
మహోన్నత వ్యక్తిత్వం ఆమెది...! 
అవయవ దాతలకు తగిన గుర్తింపును, గౌరవాన్ని కలిగించటం కోసం ఎన్నో శ్ర మ, దమాదుల కోర్చి, ప్రభుత్వాలను ఒప్పించ గలిగిన సామర్ధ్యం ఆమెది 
సహృదయు లైన అనేకా నేక సామాన్యులతోపాటు
గొప్ప గొప్ప డాక్టెర్లు, కలెక్టెర్లు, అన్నిరంగాల ప్రముఖుల అండదండలు 
పొందగలిగిన అజాతశ తృ వామె...! 
అఖిల భారత అవయవ శ రీరదానసంఘము... 
 సావిత్రి బాయి ఎడ్యు కేషనల్ట్రస్ట్ లను దిగ్విజయముగా అభివృద్ధి పదంలో నడుపుతున్న మహా మనిషి...
ఆమె యే...మన సోదరి 
 శ్రీమతి గూడూరు సీతా మహాలక్ష్మి...! 
అమ్మా ...మీ ఆశయం, ఆచరణలు ఉత్కృష్ఠ మైనవి...! 
   చరిత్ర లో చిర స్థాయిగా నిలిచి ఎందరికో స్పూర్తి నివ్వ గలవు....! నూతనాధ్యాయానికితెర తీసి చరిత్రను సృష్టించిన మీ జన్మ ధన్యము...! 💐🙏🌷
     ******

కామెంట్‌లు