కొత్త వెలుగులలో కొత్త నీరు
కాలంతో పరుగులు
దోసిలికి దొరకని బిందువులు
మళ్ళీ దొరకని క్షణాలు!
అనుక్షణం అనుపమం
ఆస్వాదించ గలిగితే!
అనుదినం ఒక అవకాశం
అంది పుచ్చుకోగలిగితే!
రేపు చేయాలనుకున్నవి
మాపటికే ముగించేసి
ఈ నాటి పనులన్నీ....
ఇపుడే చూసుకోవాలి!
ఉరకలు వేసే నీటిలా
ఉత్సాహం ఉండాలి
ఎంత ఎత్తున ఉన్నా
అంతే ఒదిగి ఉండాలి!
వేగం తగ్గని పరుగును
ఏటిని చూసే నేర్చుకోవాలి
ఎత్తు పల్లాలు ఎన్నైనా
ఎగిరి దూకుతూ వెళ్ళాలి.
తూరుపు మనకై పంపే
వేకువతో చెలిమి చేసుకోవాలి
మార్పులన్నీ ఒప్పుకుని
వేడుకగా నడవాలి!
బ్రతుకు బాటలో
బంగరు కాంతులకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి