కొత్త కోరికల పొదరిల్లు
మెత్తగా మదిలో విరిసె
ఎత్తుగ విహారించేలా
మత్తులో మొత్తం ముంచేసె!
రేపటి వెలుగుకై వేచి
మాపటి నిద్దుర కాచి
ఓపని ఆత్రాల భరించి
తూరుపువైపు చూసే కళ్ళు విచ్చి!
ముందరి దినములు తలచి
సుందర స్వప్నముల కాంచి
సత్యమగుటకై స్వేదము చిందించ
నందనముగ బ్రతుకు తోచు!
మర్మము తెలిసిన పిమ్మట
నిర్మలమైన మనసు కలిగి
కర్మలయందే దృష్టిని ఉంచి
ధర్మము తప్పక సాగవలెనట!
పెంచిన వృక్షమైనా
పాటించిన ధర్మమైనా
ఎన్నటికైనా తోడుగా ఉండి
తప్పక రక్షించి తీరునట!
స్వప్నము సత్యముగా
సాకారమోందే క్షణాలను
కిరణాల పల్లకిలో తెచ్చి
ముంగిట దింపే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి