శ్రీరాముడు...
అయోధ్యలో వెలసిన
ఓ సత్య ధర్మమూర్తి..!
సరయూ నది తీరాన
వెలుగులు విరజిమ్మే జ్ఞాన మణిదీపం..!
నిరంతరం ప్రజాసంక్షేమాన్ని కాంక్షించే
లోకకళ్యాణంకోసం తపించే సౌమ్యశీలి..!
ప్రేమ కుసుమాలను పంచే సీతానాథుడు..!
భారతీయ హైందవ సంస్కృతిలో
తరతరాలుగా శోభాయమానంగా
వెలిగే సూర్యవంశ శిఖరం ..!
అందరికి ఆరాధ్య దైవమైన
ఆ శ్రీ రామచంద్ర మూర్తి
16 సుగుణాల మణిమాళికలివే…
1. గుణవంతుడు...
స్వచ్ఛమైన స్పటికంలా!
2. వీరుడు..
సీత స్వయంవరంలో హరివిల్లును
విరిచి సీతను మనువాడిన మగధీరుడు
3. ధర్మాత్ముడు...
అరణ్యవాసాన్ని పూలబాటగా
మార్చిన మహాత్యాగి...!
4. సత్యవంతుడు –
మాటపై నిలిచే మేరుపర్వత శిఖరం..!
5. కృతజ్ఞుడు...
6. దృఢసంకల్పం గలవాడు...
7. యుగయుగాల చరిత్రగలవాడు... కాలగమనానికి వెలుగురేఖ!
8. ధైర్యవంతుడు...
అశ్వమేధ యాగశక్తి గలవాడు..!
9. ప్రాణమిత్రుడు...
సకల జీవజాతికి సంరక్షకుడు..!
10. విద్వావంతుడు...
సకల విద్యలను...ఔపాసన పట్టినవాడు..!
11. సమర్థుడు...
సమసమాజ రామరాజ్య శిల్పి..!
12. అందాల రాముడు...
ఒకసారి చూస్తే కన్ను తిప్పుకోలేని చక్కని
ముఖవర్చస్సుగల అతిలోక సుందరుడు
13. స్థిత ప్రజ్ఞత గలవాడు...
అగ్నిని కడుపున దాచుకునే హిమవంతుడు...!
14. తేజోమయుడు...
కోటిసూర్యుల వెలుగును మించినవాడు..!
15. శత్రువును సైతం ప్రేమించేవాడు... యుద్ధభూమిలో శత్రుదేహంలో
స్నేహవిత్తనం నాటిన కరుణామూర్తి...!
16. అవసరంలో కోపాన్ని
ప్రదర్శించే శాంతి సముద్రం...!
రావణుడు...ఓ రాక్షసరాజు...
పెదాలతో వేదమంత్రాల్ని ఉచ్చరించినా
కామదాహం నరక ద్వారాన్ని తెరిచె..!
బ్రహ్మజ్ఞానంతో మహాపండితుడైనా...
పరస్త్రీ వ్యామోహంతో పతనమైపోయె..!
రావణాసురుని పదితలల
వెనుక పది దుర్గుణాలుండే...అవే
1. కామం...
2. కోపం...
3. క్రోధం...
4. లోభం...
5. మోహం...
6. మదం...
7. మాత్సర్యం...
8. బలహీనత...
9. దురాశ...
10. వక్రబుద్ధి..
ఈ పది దుర్గుణాలే
రావణున్ని రాక్షసున్ని చేశాయి..!
ఆ పదహారు సుగుణాలే
శ్రీరామున్ని పరంధామున్ని చేశాయి..!
ఓ భక్తాగ్రేశ్వరులారా..!
ఎవరికి మీరు వారసులు…?
పది తలల రావణాసురుడికా…!
పదహారు సుగుణాల శ్రీరాముడికా…!
తేల్చుకోండి…తక్షణమే… తేల్చుకోండి…!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి