ఆడుకుంటానమ్మా
ఇటు వచ్చి చూడమ్మా
ఈమె ఎవరో చెప్పమ్మా
ఉమా ఆమె పేరంది
ఊట నీరు తెచ్చింది
రుక్మిణిని పిలిచింది
రూపమేమో చూపింది
ఎవరిటు వచ్చినారు
ఏమి తెచ్చిచ్చినారు
ఐరావతమిచ్చినారు
ఒకటి రెండు అన్నారు
ఓరగంట చూశారు
ఔరా అని పిలిచారు
అందరి ముందు నిలిచారు
అః అటూ మురిసారు
అచ్చులన్నీ నేర్చారు
ముచ్చట పెట్టి నిలిచారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి