సంకల్ప బలం....! :-\ కోరాడ నరసింహా రావు.
"చా విం కా  రాలేదే...!" అని విసుక్కుంటున్న వాడ్ని... 
  మరణించినాక కూడా... 
 జీవించే వుండాలని కోరు కోవటమా....!

నన్ను నేను ఉద్దరించుకోటం చేత గాని వాడ్ని... 
  ఈ సమాజానికి, దేశానికీ యేదో ఉద్దరించేస్తా ననుకోవటం....వెర్రితనం కాదూ...!! 

నిరాశ ,నిష్పృహ,నిర్వేదం

వాలని- వీలనీ  చూస్తుంటే 
 ఆశ్చర్యం వేస్తుంది...! 

వారందరికీ
అదృష్ఠము కలిసొచ్చి0దో..., 
   లేక... కేవలం అది వాళ్ల తెలివి,సామర్ధ్యాలో...,నాకైతే అర్ధం కావట్లేదు...!! 

ఎంతో మంది ఎన్నెన్నో విధాల రాణిస్తుంటే..., 
 నే నెందుకు యేదీ చేతగా ని వానిలా యేమీ సాధించ లేక పోయాను...!? 

నా బ్రతు కెందుకు ఎంత సాగినా ... గొర్రె తోక బెత్తె డే, అన్నట్టయిపోయింది?! 

"ఇవన్నీ పూర్వ జన్మల సుకృత, దుష్కృత ఫలాలు"
 అన్నదే సత్యమా....!! 

ఆ యోగమే వుంటే ,అలా రాసి పెట్టు0టే... అవకాసాలు వాటి కవే వెతుక్కుంటు  వస్తా యన్నదే నిజమా...!! 

"సంకల్పం బలమైన దైతే... 
 జరిగి తీరుతుంది"
  ఇదినూటికినూరుపాళ్ళూ  సత్యమే...అని రుజువై పొయ్యింది...! 

 కాకుంటే..., 
   తనబ్రతుకు తను బ్రతకటమే చేత కాని వాడు... 
   ఎ ప్పు డూ... యే ఒక్క రికీ యే విధంగానూ ఉపయోగ పడలేక పోతున్నాను,అనిబాధపడే వాడు... 
   
"నే నే దైనా ఓ గొప్ప పని చేసి ఈ సమాజానికి సాయపడాలి"  అని  తపన పడే వాడు...! 

వాడి ఆశ ,ఆశయం,తపన, తాపత్రయం...ఇలా నెరవేరు తుందని కల లో నైనా అనుకున్నాడా.!? 
  బ్రతి కుండి చెయ్య లేని ఘన కార్యం....మరణించి సాధించాడు...! 

తాను అకాల హటాన్మరణం పొందినా... 
తను ఆశ పడ్డట్టుగానే... 
 కేవలం నలు గురు వ్యక్తు లకే కాదు.... నాలుగు కుటుంబాలలో వెలుగులు నింపాడు...! 

ఇది కదా నిజమైన మరణానంతర జీ వన మంటే...! 
 మిత్రమా...అమర్ రహో!
 నీ జన్మ ధన్యము...!! 
      *****

కామెంట్‌లు