చెట్టు
తన అన్నాన్ని తనే తయారు చేసుకుని
తన చుట్టూ ప్రాణులకు
అన్నంగా మారుతుంది!!
రైతు
తన అన్నాన్ని తనే పండించుకుని
ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు!!
ప్రపంచమంతా
అన్నమో రామచంద్ర అంటుంటే
పట్టెడు అన్నం పెట్టని పాలకులు
తలదించుకునేలా
కడుపునిండా అన్నం పెడుతున్న అన్నదాత!!
వ్యవసాయాన్ని వ్యాపారం చేయని
ఒకే ఒక వ్యక్తి
ఒకే ఒక వ్యవస్థ-రైతు!!!
ప్రపంచం
డబ్బు కోసం ఏమైనా చేస్తుంది
వ్యాపారం చేస్తుంది
వ్యవసాయంతో వ్యాపారం చేస్తుంది!!!
రాజకీయం
రాజ్యం కోసం ఏమైనా చేస్తుంది
రైతుతో రాజకీయం చేస్తుంది
రాజ్యం ఏలుతుంది!!!?
రాజకీయాలకు పార్టీలకు సిద్ధాంతాలకు
అతీతంగా
స్వతంత్రంగా బ్రతుకుతూ
ప్రపంచాన్ని బతికిస్తున్న రైతన్న ను
బజారుకీడ్చీ
బ్రతుకుతెరువు లేకుండా చేస్తున్న
వ్యవస్థతో వ్యవసాయం చేస్తూ
కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్న
పనిలో ఉన్నాడు- రైతు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి