ప్రముఖ రాజకీయవేత్త రుద్ర గౌడ్ కు సోమన్న పుస్తకాల బహుకరణ

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు డా.గద్వాల సోమన్న తాను రచించిన 67, 68 పుస్తకాలు "సూక్తి చంద్రిక మరియు పూలసజ్జ" ప్రముఖ రాజకీయ వేత్త, జన నేత శ్రీ రుద్ర గౌడ్ గారికి హెడ్మాస్టర్ జయవంత్, ఉపాధ్యాయులు,విద్యార్థుల సమక్షంలో అందజేశారు.అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పద్మావతి గారి పదవీ విరమణ సన్నాన కార్యక్రమానికి రుద్ర గౌడ్ హాజరవ్వడం విశేషం. అనతి కాల వ్యవధిలో 70 పుస్తకాలు రచించిన కవి గద్వాల సోమన్న  అవిరళ కృషిని అందరూ ప్రశంసించి,అభినందించారు.
కామెంట్‌లు