పల్లవి :-
ఈ భవ సాగరమును దాటాలంటే ఆ సర్వేశ్వ రుని భక్తి,శ్రద్దలతొ ఆరా ధించుమురా...!
సునాయాసముగముక్తిని బొంది శాశ్వతానందమొం దగలవురా...!!
వినరా వినరా ఓ జీవా...
ఈ సత్యమును నీవుతెలుసు కోరా...!
చరణం :-
యేభాషా,పాండిత్యాలతొ
పని లేదురా.... 2
పూలూ,పండ్లు,అర్చనలు
యే ఆర్భాటాలూ అక్కర లేదురా...
"యేభాషా,పాండిత్యా.."
నిర్మలభక్తితొ నీమనోపుష్ప మును అర్పించుమురా
ఆ దేవ దేవుని అను గ్రహ మును పొంద గలవురా..!
ఆ పరమ పధము నీ వందగలవురా...!!
వినరా వినరా ఓ జీవా...
ఈ సత్యమును నీవుతెలుసు కోరా...!
చరణం :-
జాలి, దయ, ప్రేమల హృ దయమె దేవాలయమురా
పరోప కారమే పూజరా...
సేవ యే గొప్ప అర్చనరా , అభిషేకమురా...!
ఇవి యే నిజమగు దైవా రాధన తెలుసుకోరా...
ఈ సత్యమును నీవు తెలుసు కోర...!
నీ వు తెలుసు కోరా...!!
నీవు తెలుసు కోరా...!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి