మనిషి తన ఉనికి, రక్షణ ,ఆహారం ,వినోదం ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ, జంతుజాలాన్ని బంధించాడు. వాటిని బానిసలుగా మార్చి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి, తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. సర్వజీవ సమానత్వం అనే శాస్త్ర వ్యాక్యం స్పూర్తికి విరుద్ధంగా సాగుతున్నాడు.తాను పొందుతున్న ప్రతి ఫలానికి కనీస కృతజ్ఞత లేకుండా, ఆ జీవజాలం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, జాలి-కరుణ లేని వైనం, హద్దులు లేని హింస అన్ని హద్దులను చెరిపేస్తోంది. తమకూ కొన్ని హక్కులున్నాయని తమకే తెలియని ఆ మూగ జీవులను చూస్తే గుండె చెరువైపోతుంది. అవి పడుతున్న బాధలు, చేస్తున్న కష్టం, అనుభవిస్తున్న హింస చూస్తే మనసు వికలమై పోతుంది. అన్ని జీవులలో ఉత్తముడనని, మహా మేధావినని విర్రవీగే మనిషి, నోరు లేని మూగ జీవాల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ, వాటిని హింసించటం, చంపటం అన్యాయం, అనాగరికం. ఒక జీవి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. మనకు రక్షణను, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, జీవనాధారాన్ని యిచ్చే మూగజీవాల పట్ల, కృతజ్ఞతా భావంతో, పూజనీయ భావంతో మెలగటం మన అందరి విధి, కనీస ధర్మం, మానవత్వం. జంతువుల స్వేచ్ఛాస్వాతంత్య్రాలకోసం, జంతువుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేసిన ''సాధు టి.ఎల్. వాస్వాని'' జయంతి అయిన నవంబర్ 25వ తేదీని జంతు ప్రేమికులు, జంతు సంరక్షణా సంస్థలు ''జంతువుల హక్కుల దినం'' గా జరుపుకుంటున్నారు. మనుషుల వలన జంతువులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలిగినా అది వాటి స్వేచ్ఛను హరించినట్టే అని, వాటి హక్కులను కాలరాసినట్టే అని జంతు సంక్షేమ సంస్థలు భావిస్తున్నాయి. జంతువుల హక్కుల దినమైన నవంబర్ 25న, మాంసాన్ని తినకుండా, ''నో మీట్ డే''ను పాటించాలని సంస్థలు, జంతు ప్రేమికులు కోరుతున్నారు. ప్రకృతిలో ప్రతి జీవికి నిర్వర్తించాల్సిన ధర్మం ఒకటుంటుంది. ఆ ధర్మాన్ని ప్రకృతే నిర్ణయించింది. ఈ భూ ప్రపంచం సజావుగా నడవాలంటే అన్ని జీవులు జీవించాల్సిందే. ఏ కొన్ని జీవులు నశించినా అది మొత్తం జీవ ప్రపంచ మనుగడకే గొడ్డలిపెట్టవుతుందనేది మనమందరం గ్రహించాలి
కరుణ తత్వం :- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి