తాత రామశరణ్ పాఠక్ నిగూర్చి కొంత తెలుసుకోవాలి.ఆయన ఇంట్లోంచి పారిపోయి హైద్రాబాద్ సైనిక పటాలంలో చేరాడు.10ఏళ్లు తర్వాత తన పల్లెకు తిరిగి వచ్చాడు.ఆయన ఏకైక సంతానం కులవంతి.బాల్య వివాహంచేశాడు. అల్లుడు గోవర్ధన్ పాండే.వారి కొడుకు కేదార్నాధ్. కూతురు మనవడ్ని తనదగ్గరే ఉంచుకొన్న తాత అప్పుడప్పుడు రాహుల్ని ఆతని తండ్రి దగ్గర కు పంపేవాడు.వారం పదిరోజులుండి వచ్చే ఆచిన్నారికి తండ్రిప్రేమ దూరమైంది. తాత క్రమశిక్షణ తో పెరిగిన పసిమొగ్గ. తాత రామ్శరణ్ పాఠక్ మనవడికి చొక్కాలాగూలు ఒక ముస్లించేత కుట్టించేవాడు.ఆదర్జీ వంశపారంపర్యంగా ఆకుటుంబానికి దుస్తులు కుట్టే వంశంవాడు.మనవడిని వెంట బెట్టుకొని బస్తీలో బట్ట కొనేవాడుతాతగారు. ఆరోజుల్లో పచారీషాపుల్లో పసుపు లవంగాలు అమ్మే చోట బట్టలు అమ్మటం నేడు మనకి వింతగా ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపిస్తుంది.
తాత కి ముస్లింలతో మంచి స్నేహ సంబంధాలుండేవి. ఆయన ఇంటిలో వారు కుండలో మంచినీరు స్వయంగా తామే ముంచుకుని తాగేవారు. వైష్ణవ దీక్ష పొందిన అమ్మమ్మ తాతల దగ్గర భక్తి తో మెలిగేవాడు రాహుల్! పొద్దున్నే చద్దన్నంతిని బడిలో ఉర్దూ నేర్చుకున్నాడు. సిరాతో అక్షరాలు దిద్దించేవారు తెల్లటి పట్టీపై. హిందీ నేర్చుకునే పిల్లలు ఇసుకలో అక్షరాలు దిద్దేవారు. రాహుల్ చేతులు కాళ్లకు వెండి కడియాలు,చెవులకు బంగారు పోగులతో గొప్పింటిబిడ్డ గా పెంచబడ్డాడు. తాత గారి పెత్తనం మరి!
సశేషం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి