పుస్తక ప్రపంచం51 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 సాదే హెదాయత్ ఇరాన్ దేశరచయిత. ఆయన రాసిన దిబ్లైండ్ ఔల్ పర్షియన్ భాషలోంచి ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది.20వశతాబ్దపు ఇరాన్ జీవిత విధానం,రెజాషా పరిపాలన కి అద్దంపట్టింది. 1937లో ఇండియాలో ప్రచురితమైనది. హెదాయత్ అప్పుడు మనదేశంలోనే ఉన్నాడు.1941లో ఇరాన్ లో వెలుగుచూసింది.ఇటాలియన్ కార్లోకొలోడీ రాసిన దిఅడ్వెంచర్స్ ఆఫ్ పినోచియో పిల్లల నవల.పినోచి పప్పెట్ ఫేరీటేల్ కాదు.నిజజీవితంలో కష్టాల కథ.అన్నివిధాల కొత్త పుంతలు తొక్కిన పిల్లల నవల.పోర్చ్ గీస్ రచయిత జోస్ శరమాగో రాసిన బ్లైండ్నెస్ లో ఒక నగరంలోని జనాలంతా హఠాత్తుగా అంధులవటం దీని కథ.ఊహించుకుంటేనే బాధ భయం వేస్తుంది కదూ? 🌹
కామెంట్‌లు