ఎవరికోసం?:- జంజం కోదండ రామయ్య(జాతక బ్రహ్మ)-జమ్మిపాళెం-63000 41188
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
=============
ఆకాశం నల్లబడింది ఎందుకో
వానకురిసి పంటలు పండి
అందరి కడుపులు నింపాలని...!

శలయేరా?ఎందుకు పరుగు
నోరెండి అల్లాడే ప్రజలకు
దాహం తీర్చాలని ఆశతో...!

వేకువనే కదిలావు పక్షీ!
మంచు ఎవరికోసం ఎందుకోసం?
ఆకలితో అల్లాడే బిడ్డలకోసం...!

భూమిని చీల్చుకుని వస్తున్నావు
ఎవరిని ఉద్దరించాలని విత్తనమా?
ఆకలితో నకనకలాడే మనుషులకోసం..!

వెన్నెలలు కురిపిస్తూ వస్తున్నావు
పున్నమి చందురుడా ఎవరికోసం
ప్రేమికులు ఆనందిస్తే సంతోషిద్దామని....!!


కామెంట్‌లు