బ్రతుకు సిత్రాలు :- మీనుగ సునీత -7981235656
సాహితీ కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
==============
అణగారి చితికిన బతుకులు,
చివుకు చివుకనే ఆశలు,
చింతల బ్రతుకులు చిగురించేనా?

ఎంతని సాగేనీ పోరాటం, 
అలసటకు గురికాదా మోమాటం!
పొంతన కుదిర్చేనా ఆరాటం?

చీకు - చింతా చివరిదాకా,
ఆదరువు రారెవరూ ఆమడదాకా!
మోయాల్సిందేనా నే కడదాకా?

రాతలు గీతలు కొందరికేనా?
మారని తలరాతలు మాకేనా? 
మసిపూసంపావు నీకిది తగునా!

జన్మ జన్మాల కర్మాలు,
మానవ జన్మకు మరలించేవా?
ఒకింత సుఖాన్ని 'వింత' గా మర్చావా!

===================

కామెంట్‌లు