పాప-చిలుక:- సత్యవాణి కుంటముక్కుల- 86 39660566
పాప ఇంటికి వచ్చె
బాగుగా చదివి

కిలాలకిలారావాల
కలకలం వినెను

అవి ఎవరి పలుకులని
అడిగింది పాప

చిలుక పలుకులుఅని
చెప్పింది అమ్మ

ఆత్రంగ గదిలోన
అడుగిడెనుపాప

అచ్చెరువు బొందెను
ఆచిన్ని పాప

పంజరంలో వుండె
పచ్చనీ చిలుక

టపటపా రెక్కలను
కొట్టుకొనుచుండె

ముందు వుంచిన పండు
ముట్టనేలేదు

కాసిన్ని నీళ్ళైన 
కుడువనేలేదు

బేలగా చూసింది
ఆ బాలవంక

పంజరం తెరవమని పాపనడిగింది

బంధించ పాపమని
బడిని చెప్పేరు

గుర్తొచ్చెనామాట
గుబులు పుట్టింది

తెరిచింది పాపాయి
పంజరం తలుపు

రివ్వున ఎగిరింది 
ఆరామచిలుక

చేతులూ చరిచింది
చిన్న పాపాయి

అదిచూసి అమ్మేమొ
అచ్చరువు నందె

తలమీద ముద్దెట్టి
తాయిలం పెట్టె

           

కామెంట్‌లు