ఓ ప్రభూ !నువ్వేసర్వాంతర్యామి:- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
జీవితం అంటే రాత్రొచ్చిన 
కలకాదు
జీవితం అంటే పనిలేక
పగలు పడుకుంటే
వచ్చిన పగటికలకాదు
అదీ శ్రమజీవన సౌందర్యం

కలచెదిరి పోయాక వాస్తవం
బహిర్గతం అయ్యాకా
నీ అజ్ఞానాన్ని నువ్వు తలచుకొని
నేను తప్పుచేసానని
బాధపడ్డప్రయోజనమేముంది

ఓ దేవుడా ఎందుకు నన్నీ
నిరుపేద తల్లిదండ్రులకు
బిడ్డగా ఇచ్చావు
ఆశలు చంపుకొని
ఆశయాల్నీ నెరవేర్చుకోలేక
నిస్తేజంగా బ్రతకమని

చదువు సంధ్యలులేవు?
కడుపునిండా ఆహారంలేదు
కాళ్ళురెక్కలే ఆస్తిపాస్తులుగా
బ్రతికేపేదలకు
ఉపాధి హామీలేదు
బ్రతికేదెలా?
కూటి కొరకే కోటి తిప్పలు
ఎందుకయ్యా!
ఓ ప్రభూ!
పేదవాడికి
ఆకలిజబ్బునిచ్చావు
వాడికి ఆహారంమరిచావు
ధనికుడికి
తినికక్కేంత
ఆహారం ఇచ్చావు
రోగాన్ని బహుమానంగా
ఇచ్చావు

పేదవారికి ఆత్మీయతాను
రాగాలతో బ్రతుకుల్నీ వెలిగించాలని
ధర్మ సూక్ష్మం ఉద్బోధించావు
ధనికుడిని
వస్తుప్రేమల్లో ముంచి తేల్చి
ధనంపై వ్యామోహం పెంచి
మనుషులకుమానవీయ విలువలను మృగ్యం చేసావు
హే భగవాన్!
నీ లీలలు అంతుచిక్కనివయ్యా!!
సకల చరాచర సృష్టికి
 మూలమైన వాడా!
ఓ సర్వాంతర్యామి!!
పాహి పాహి!
పాహిమాం!
రక్ష రక్ష!
రక్ష మాం !!



కామెంట్‌లు