ప్రకృతి పరిరక్షణ:- డా.భరద్వాజ రావినూతల(:భరద్వాజ)-కొత్తపట్నం-9866203795
సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
===============
చెట్టు నీడ హాయిగా...
గాలి వీస్తే గానం...
పచ్చని ఊపిరి లాలి...!

వాన చినుకులు ముద్దుగా...
మట్టి సువాసన మత్తుగా...
నదుల ప్రవాహం నాదంగా..!

పక్షి కిలకిల పాట...
ఆకాశం తాకే రెక్కలు...
చెట్టుపై ఆశ్రయం ఉండే...!

పర్వత శిఖరం ప్రశాంతంగా...
జలపాత జలసవ్వడి మధురంగా...
అడవి నిశ్శబ్ద మైమరపే..!

గడ్డి పచ్చని పరిపక్వం...
మడుగు నీటిలో జీవం...
గర్వంగా ప్రకృతి గీతం..!
🪗🪗🪗🪗🪗🪗🪗🪗🪗🪗

కామెంట్‌లు